ముఖ్య అతిథులుగా..


Sun,December 16, 2018 12:35 AM

Ram Charan for Varun Tej  Antariksham Pre-Release Event

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ప్రీరిలీజ్ ఈవెంట్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పలువురు అగ్ర కథానాయకులు అతిథులుగా విచ్చేసి సందడి చేస్తుండటంతో ఈ వేడుకలు సినీ ప్రియుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. తాజాగా పడిపడి లేచె మనసు చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హను రాఘువపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
Allu-Arjun.jpg
ఇదిలావుండగా వరుణ్‌తేజ్ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అంతరిక్షం చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 18న నిర్వహించబోతున్నారు. దీనికి రామ్‌చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మెగా హీరోలిద్దరూ ఈ వారంలో అతిథులుగా అభిమానులను అలరించబోతుండటం విశేషం.

4646

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles