టాలీవుడ్‌ను విస్మరించను!

Mon,December 2, 2019 10:50 PM

‘దే దే ప్యార్‌ దే’ సినిమా విజయంతో బాలీవుడ్‌ పరిశ్రమలో రకుల్‌ప్రీత్‌సింగ్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల్ని ఓకే చేసిందీ అమ్మడు. ‘హిందీ చిత్రసీమలో సవాలుతో కూడిన మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతి సినిమా కోసం నేను ఒకే రకమైన అంకితభావంతో పనిచేస్తాను. అయితే ఫలితాలు మన చేతిలో ఉండవు. అదృష్టం కొద్ది ఈ ఈ ఏడాది కెరీర్‌ ఆశాజనకంగా కనిపిస్తున్నది’ అని చెప్పింది రకుల్‌. బాలీవుడ్‌తో పాటు తమిళ భాషలో వరుస అవకాశాలు వరిస్తున్నా..తెలుగు సినీరంగానికే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ సోయగం.


‘తెలుగు పరిశ్రమకు నేనెప్పుడు రుణపడి ఉంటాను. ఈ ఏడాది రెండు సినిమాలు చేయబోతున్నాను. టాలీవుడ్‌లో నేను నటిగా ఎదిగాను. ఊహించని స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాను. సినిమా కళను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ బాటలు వేసింది. అందుకే ఏ భాషలో సినిమాలు చేస్తున్నా..తెలుగును మాత్రం ఎప్పటికీ విస్మరించను’ అని చెప్పింది

216

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles