మనసైనవాడి కోసం..

Mon,September 30, 2019 12:03 AM

ప్రేమ, పెళ్లి విషయాల ప్రస్తావన రాగానే మన కథానాయికలు సిగ్గులమొగ్గలై పోతారు. చాలా వరకు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తారు. పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్ మాత్రం తన మనసులోని భావాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంది. ఎలాంటి దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది. ఓ ప్రైవేట్ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ గురించి ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించిందీ సొగసరి. సుదీర్ఘకాలంగా ఒంటరిగానే ఉంటున్నానని, నచ్చిన చెలికాడి కోసం అన్వేషిస్తున్నానని చెప్పింది. ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరో కాలమే నిర్ణయిస్తుందని పేర్కొంది. సినీరంగంలో ఏ హీరోల మీద క్రష్ ఉందో చెప్పాలని కోరగా...బాలీవుడ్‌లో రణవీర్‌సింగ్, తెలుగులో విజయ్‌దేవరకొండ అంటే ఇష్టమని తెలిపింది. విజయ్‌దేవరకొండతో కలిసి సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. త్వరలో ఈ ఎపిసోడ్ ఓ ప్రైవేట్ డిజిటల్ మీడియాలో ప్రసారంకానుంది.ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ హిందీలో మర్జావన్ చిత్రంలో నటిస్తున్నది. నవంబర్‌లో ప్రేక్షకులముందురానుంది. కమల్‌హాసన్ కథానాయకుడిగా రూపొందుతున్న ఇండియన్-2 సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది.

593

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles