కలల సాకారం కోసం..


Sat,February 9, 2019 12:17 AM

Rakul Preet Big is saying what is important for him

నటిస్తున్న పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలనన్నదే తనకు ముఖ్యమని అంటున్నది రకుల్‌ప్రీత్‌సింగ్. సెట్స్‌లో అడుగుపెట్టిన తర్వాత తనను తాను పూర్తిగా మర్చిపోతానని, ప్రతి క్షణం పాత్ర గురించి ఆలోచిస్తూ అందులో ఇమిడిపోయే ప్రయత్నం చేస్తానని చెబుతున్నది. రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ సినిమా చిత్రీకరణలో నిరంతరం ఆశావాహ దృక్పథంతో ఉంటాను. మనం సంతోషంగా ఉంటే ఆ ప్రభావం మనం చేసే పనిపై ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతాను. మనసులో ఎంత ఒత్తిడి ఉన్నా అది ముఖంపై ప్రతిఫలించకుండా నిర్మలంగా ఉండటానికే ప్రయత్నిస్తాను. ఓ సన్నివేశంలో బాగా నటించానంటే ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది. బాగా రాకపోతే డీలా పడిపోతుంటాను. ఆ బాధను ఆ రోజుకే పరిమితం చేస్తాను. మరుసటి రోజును కొత్తగా మొదలుపెడతాను అని తెలిపింది. సినిమాల నుంచి తీరిక దొరికితే స్నేహితులతో కబుర్లు చెబుతానని అంటోంది రకుల్. జీవితంలోని ప్రతి క్షణాన్ని నాకు నచ్చినట్లుగా మలచుకోవడానికి ప్రయత్నిస్తాను. చిన్న చిన్న ఆనందాలకు విలువనిస్తాను. స్నేహితులతో కాలక్షేపం, కుటుంబ సభ్యులతో గడిపే కొద్దిపాటి సమయమే నాలో ఎక్కువ సంతృప్తినినింపుతుంది. కలల ప్రపంచంలో విహరించడమే కాదు వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతుంటాను అని తెలిపింది.

1435

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles