ఆగస్టు 2న రాక్షసుడు


Thu,July 11, 2019 12:33 AM

Rakshasudu in post production release on August 2

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రాక్షసుడు. రమేష్‌వర్మ పెన్మత్స దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఎ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. ఇదొక నేరపరిశోధనాత్మక థ్రిల్లర్. రమేష్‌వర్మ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మేకింగ్ పరంగా ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తమ్ముడిని ఈ చిత్రం ద్వారా డైలాగ్ రైటర్‌గా పరిచయం చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని ఆగస్టు 2న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

1117

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles