రజనీ ద్విపాత్రాభినయంలో..


Mon,March 25, 2019 03:33 AM

Rajinikanth takes a pay cut for his next film with AR Murugadoss

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తరువాత రజనీ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని తెలిసింది. అంతే కాకుండా ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారని చిత్ర వర్గాల సమాచారం. ఒక పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, మరో పాత్రలో సామాజిక కార్యకర్తగా కనిపిస్తారట. రజనీకాంత్ నటించిన మూండ్రు ముగమ్ పోలీస్ ప్రధాన చిత్రాల్లో ఇప్పటికీ తిరుగులేని చిత్రంగా నిలిచింది. ఆ స్థాయిలో మళ్లీ రజనీ పోలీస్ పాత్రలో కనిపించలేదు. మురుగదాస్ తెరకెక్కించనున్న చిత్రంలో సుదీర్ఘ విరామం తరువాత పోలీస్ పాత్రలో రజనీ కనిపించబోతుండటం ఆసక్తికరంగా మారింది. త్వరలో తెరపైకి రానున్న ఈ సినిమా ముంబై నేపథ్యంగా సాగుతుందని, నయనతార, కీర్తిసురేష్ కథానాయికలుగా నటించనున్నారని సమాచారం. చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి దీపావళికి విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

1163

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles