ముంబాయిలో షురూ


Wed,April 10, 2019 11:44 PM

Rajinikanth starts Darbar shoot in Mumbai

రజనీకాంత్, మురుగదాస్ కలయికలో రూపొందుతున్న తొలి చిత్రం దర్బార్. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. బుధవారం ముంబాయిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణను ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రజనీకాంత్, మురుగదాస్‌తో పాటు చిత్ర నిర్మాత సుభాస్కరన్ పాల్గొన్నారు. సినిమాలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.ఇందులో రజనీకి జోడీగా నయనతార కథానాయికగా నటిస్తున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

1052

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles