రజనీతో సినిమా నమ్మలేకపోతున్నా!


Thu,November 15, 2018 12:31 AM

Rajinikanth Smiles Simran Bagga Blushes As They Gear Up For Pongal

రజనీకాంత్ కథానాయకుడిగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా తమిళ చిత్రం పేట్టా. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రన్, త్రిష, విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలను పోషిస్తున్నారు. రజనీకాంత్, సిమ్రన్‌లతో కూడిన కొత్త పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బుధవారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఎరుపు రంగు జాకెట్, మెడలో కండువా ధరించి చేతిలో పూల కుండీతో ైస్టెలిష్‌లుక్‌లో కనిపిస్తున్నారు రజనీకాంత్. పసుపువర్ణ దుస్తుల్లో సిమ్రన్ చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చారు.

సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రజనీకాంత్‌తో సినిమా చేశానంటే నమ్మలేకపోతున్నా. చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ పోస్టర్‌ను ఉద్దేశించి సిమ్రన్ వ్యాఖ్యానించింది. కబాలి, కాలా చిత్రాల్లో వయసు మళ్లిన పాత్రల్లో కనిపించిన రజనీకాంత్ ఇందులో ఆధునిక ఛాయలతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హాస్టల్ వార్డెన్‌గా, సైనిక అధికారిగా భిన్న పార్శాల్లో ఆయన పాత్ర సాగనున్నట్లు తెలిసింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.ఓ చిత్రం ఈ నెల 29న విడుదలకానుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందడం గమనార్హం.

3328

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles