మురుగదాస్ కథలో..


Sat,April 13, 2019 01:01 AM

rajinikanth s darbar poster has reacted to allegations of plagiarism

రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబయిలో ప్రారంభమైంది. ఇదిలా వుండగా మురుగదాస్ ఓ మహిళా ప్రధాన చిత్రానికి కథ అందిస్తున్నారని తెలిసింది. ఇందులో త్రిష ప్రధాన పాత్రలో నటించనుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. జర్నీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న శరవణన్ ఓ ప్రమాదం కారణంగా గాయపడ్డారు. అప్పటి నుంచి సినిమా నిర్మాణానికి దూరంగా వుంటున్నారు. ఇటీవలే కోలుకున్న ఆయన మురుగదాస్ అందిస్తున్న మహిళా ప్రధాన ఇతివృత్తానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.

613

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles