రజనీ పోలీస్ పవర్?


Mon,January 21, 2019 11:46 PM

Rajinikanth Petta  Ajith Viswasam  Box Office Collection

ఇటీవలే పేట సినిమాతో చక్కటి విజయాన్ని అందుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన తదుపరి చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించబోతున్నారని చెన్నై సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ సినిమా కథాంశానికి సంబంధించిన అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. రాజకీయ అరంగేట్రానికి రజనీకాంత్ సిద్ధమవుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో..మురుగదాస్ తీయబోయే సినిమా రాజకీయ ఇతివృత్తంతో ఉంటుందని, రజనీకాంత్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీకాంత్ శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. గతంలో రజనీకాంత్ పోలీస్ పాత్రల్లో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించాయి. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.

1530

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles