కరికాలుడి సమరం!


Mon,May 21, 2018 12:23 AM

Rajinikanth Kaala to release worldwide on June 7

RAJINIKANTH
కరికాలన్ ఉరఫ్ కాలా ముంబయిలోని ధారావి ప్రాంతానికి కింగ్ లాంటివాడు. అతని అనుమతి లేనిదే అక్కడ ఏ పనీ జరగదు. అలాంటి అతనికి హరినాథ్ దేశాయి అనే వ్యక్తికి మధ్య వున్న వైరమేంటి? ముంబై నేరసామ్రాజ్యానికి కరికాలన్ అంటే భయమెందుకు? ఈ విషయాలన్నీ తెలియాలంటే మా కాలాచూడాల్సిందే అంటున్నారు పా. రంజిత్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం కాలా. రజనీకాంత్ కథానాయకుడు. బాలీవుడ్ సోయగం హుమా ఖురేషీ కథానాయిక. వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై హీరో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. జూన్ 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 2గంటల 45 నిమిషాల నిడివితో ఈ చిత్రం సాగనుందని తెలిసింది. ముంబైలోని ధారావి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ మాఫియా డాన్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు, బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర బృందం చెబుతున్నది. సముద్రఖని, ఈశ్వరీరావు, అంజలి పాటిల్, సుకన్య, షాయాజీషిండే, రవికాలే, పంకజ్ త్రిపాఠీ తదితరులు నటిస్తున్నారు.

1316

More News

VIRAL NEWS