రజనీకాంత్ దర్బార్!


Tue,April 9, 2019 11:45 PM

rajinikanth ar murugadoss film titled as darbar first look released

రజనీకాంత్ గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సినిమాల విషయంలో స్పీడు పెంచారు. ఈ ఏడాది పేట్టా చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆయన తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్బార్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నయనతార కథానాయిక. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ మంగళవారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. రజనీకాంత్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ఫస్ట్‌లుక్‌లోనే చెప్పేయడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ చిత్రం కోసం ఇటీవలే ముంబయిలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించారు. ఇక్కడే 30 రోజుల పాటు జరిగే తొలి షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారట. రజనీ కూతురు పాత్రలో యువ కథానాయిక నివేదా థామస్‌ని ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాల సమాచారం. దర్శకుడిగా మురుగదాస్‌కు మంచి క్రేజ్ వున్నా ఇంత వరకు రజనీతో ఆయన సినిమా చేయలేదు. తొలిసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో దర్బార్ చిత్రంపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగుల్ని జోడించి దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అనిరుధ్ సంగీతం, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

1439

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles