చైనాలో 2.ఓ..


Thu,December 6, 2018 12:14 AM

rajinikanth 2 0 all set to hit screens in china

రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 2.ఓ ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని చైనాలోనూ విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి నాలుగు రోజులకే 400 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రాన్ని చైనాకు చెందిన హెచ్‌వై మీడియాతో కలిసి లైకా ప్రొడక్షన్స్ 56 వేల స్క్రీన్స్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో 47 వేల స్క్రీన్స్‌లలో 3డీ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. గతంలో ఈ సంస్థ సోనీ, ట్వంటియత్ సెంచరీ ఫాక్స్, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్, డిస్నీ వంటి సంస్థలతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని విడుదల చేసిందని, ప్రపంచవ్యాప్తంగా రజనీకి వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే భారీ స్థాయిలో వచ్చే ఏడాది మేలో 2.ఓను విడుదల చేస్తున్నామని చిత్ర బృందం తెలిపింది.

1951
Tags

More News

VIRAL NEWS