మోదీగా రాజేంద్రప్రసాద్

Mon,September 30, 2019 12:07 AM

ఒంటినిండా టాటూలతో తెల్లటి గడ్డం, కేశాలతో కళ్లద్దాలు ధరించి ైస్టెలిష్ కనిపించే ఈ మోదీ కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు భవానీ శంకర్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ైక్లెమాక్స్. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్, సాషాసింగ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. పి.రాజేశ్వర్‌రెడ్డి, కె.కరుణాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. నిర్మాతలు మాట్లాడుతూ రాజకీయ వ్యంగ్యాస్త్రంగా రూపొందుతున్న చిత్రమిది. మర్డర్ మిస్టరీ ఇతివృత్తంతో ఆసక్తిని పంచుతుంది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. త్వరలో భారీ సెట్‌లో పాటను తెరకెక్కించనున్నాం అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ మోదీ పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించబోతున్నారు. అతడికి ఈ పేరు ఎందుకు పెట్టామన్నది థ్రిల్‌ను పంచుతుంది అన్నారు.

722

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles