రాజ్‌దూత్ వచ్చేస్తున్నాడు!


Sat,June 8, 2019 11:54 PM

rajdooth movie teaser released

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం రాజ్‌దూత్. అర్జున్-కార్తీక్ దర్శకులు. నక్షత్ర, ప్రియాంక కథనాయికలు. ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జీవిత రాజశేఖర్ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీహరి, శాంతి కుమారులు చిన్ననాటి నుంచే తెలుసు. తల్లిదండ్రుల్లాగే వారిలో మంచి వ్యక్తిత్వం వుంది. నా ఇద్దరు అమ్మాయిల్లా వారూ బిడ్డల్లాంటి వారే. మేఘాంశ్, శివాత్మిక ఒకే వయసు వారు. ఇద్దరు క్లాస్‌మేట్స్ కూడా. మేఘాంశ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా వుంది. సినిమా టీజర్, రషెస్ చూశాను.

మేఘాంశ్‌లో మంచి ఈజ్ కనిపిస్తోంది. శ్రీహరికన్నా పదిరెట్లు మంచి పేరు సంపాదిస్తాడన్న నమ్మకం వుంది. శ్రీహరి మన మధ్య లేరన్న లోటును మేఘాంశ్ తీర్చేశాడు. తను పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుల పనితనం ప్రశంసనీయం. ఈ సినిమా రిలీజ్ వరకు నేను, రాజశేఖర్ ప్రచారానికి పూర్తిగా సహకరిస్తాం అన్నారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు బావ(శ్రీహరి)ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నట్లే నా బిడ్డని చూసుకుంటారని ఆశిస్తున్నా అన్నారు. రాజ్‌దూత్ మంచి కథ. సుదర్శన్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. దర్శకులిద్దరూ చిత్రాన్ని పూర్తి స్పష్టతతో రూపొందించారు. టెక్నికల్‌గానూ సినిమా హైలైట్‌గా వుంటుంది. మాటలు, పాటలు, సంగీతం బాగా కుదిరాయి. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు.

1377

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles