కమర్షియల్ థ్రిల్లర్!


Fri,May 10, 2019 12:15 AM

Rajasekhar Kalki Movie Commercial Trailer Released

డా.రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కల్కీ. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. అదాశర్మ, నందితా శ్వేత, పూజిత పొన్నాడ కథానాయికలు. హ్యపీ మూవీస్ పతాకంపై శివాని, శివాత్మిక సమర్పణలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురువారం ఈ చిత్ర కమర్షియల్ ట్రైలర్‌ని హీరో నాని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. పార్థా కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితముపైన లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలని చేయుట మానరాదు అంటూ రేడియోలో భగవద్గీత వినిపించే వాయిస్‌తో సాగే ఈ చిత్ర ట్రైలర్ హీరో పాత్ర చిత్రణ ఏ విధంగా సాగుతుందనే విషయాన్ని చెబుతున్న తీరు ఆకట్టుకుంటోంది. 90వ దశకం నేపథ్యంలో తెరకెక్కుతున్న పరిశోధనాత్మక థ్రిల్లర్ ఇది. ఈ చిత్రాన్ని హీరో డా॥ రాజశేఖర్ నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌లుక్ టీజర్‌తోనే ఆకట్టుకుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఆ అంచనాలకు సినిమా ఏమాత్రం తగ్గకుండా వుంటుందని, ఇది కమర్షియల్ ట్రైలర్ మాత్రమే సినిమా విడుదలకు ముందు థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెలిపారు. స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్‌రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్‌దీప్, వేణుగోపాల్ తదితరులు నటిస్తున్నారు.

1566

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles