కల్కి అవతారం!


Wed,January 2, 2019 12:41 AM

rajasekhar kalki first look revealed

డా॥రాజశేఖర్ కొంత విరామం తరువాత నటించిన చిత్రం పీఎస్‌వి గరుడవేగ. సరికొత్త నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని రాజశేఖర్ కొత్త తరహా చిత్రాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం కల్కి. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. అదాశర్మ, నందితాశ్వేత కథానాయికలు. సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మంగళవారం చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ యాంగ్రీయంగ్‌మెన్ రాజశేఖర్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. 1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. నాజర్, అశుతోష్‌రాణా, రాహుల్ రామకృష్ణ, చరణ్‌దీప్ తదితరులు నటిస్తున్నారు.

1996

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles