కల్కి శత్రుసంహారం


Wed,April 10, 2019 11:50 PM

Rajasekhar And Prasanth Varma Kalki Movie Official Teaser

కలియుగాంతంలో దుష్టశిక్షణ కోసం దేవుడు కల్కి అవతారం ఎత్తి ధర్మాన్ని కాపాడాడు. పోలీస్ అవతారం ఎత్తిన నేటి కల్కి ఎవరిపై పోరాటం చేశాడన్నది తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు డా.రాజశేఖర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కల్కి. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. అ! ఫేమ్ ప్రశాంత్‌వర్మ దర్శకుడు. నందితాశ్వేత, అదాశర్మ కథానాయికలు. బుధవారం చిత్రబృందం టీజర్‌ను విడుదలచేసింది. ముసుగులు ధరించి బాణాలను సంధిస్తున్న శత్రువుల్ని సంహరిస్తూ యోధుడిగా రాజశేఖర్ కనిపిస్తున్నారు. పురాతన కట్టడాలు, మంచు కొండలతో కూడిన ప్రదేశాలు, హిందు,ముస్లిమ్ సంస్కృతుల మిళితంగా సంభాషణలు లేకుండా నేపథ్యసంగీతంతో సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నది. దర్శకుడు మాట్లాడుతూ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. పోలీస్ అధికారిగా రాజశేఖర్ పాత్ర శక్తివంతంగా సాగుతుంది.

ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు రొమాంచితంగా ఉంటాయి. యథార్థ ఘటనల స్ఫూర్తితో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కథ, కథనాలు నవ్యానుభూతిని పంచుతాయి అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. వినూత్నమైన కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మూడు రోజుల ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. త్వరలో విడుదలతేదీని ప్రకటిస్తాం అని తెలిపారు. పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్‌రాణా, సిద్దూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సాహిత్యం: కృష్ణకాంత్.

1177

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles