మరో భాషా ప్రయోగం?


Sat,November 17, 2018 10:55 PM

Rajamouli Charan meet Aalim Hakim

బాహుబలి సినిమా కోసం కిలికి పేరుతో సరికొత్త భాషను సృష్టించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. వింతైన పదాలతో ప్రతినాయకుడు పలికించిన ఆ భాష అందరి దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం రాజమౌళి మరో భాషా ప్రయోగం చేయబోతున్నారట. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ (వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దానయ్య నిర్మాత. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ నగర శివార్లలో భారీ సెట్‌ను వేశారు. అందులోనే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాల్ని చిత్రీకరించబోతున్నారు.

ఈ సినిమాలో కథానుగుణంగా అడవి నేపథ్యంలో కొన్ని సన్నివేశాలుంటాయని తెలుస్తున్నది. ఆ సన్నివేశాల కోసం కిలికి భాష తరహాలో ప్రత్యేకంగా ఓ భాషను క్రియేట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. దీనికోసం రాజమౌళి కొందరు రచయితలతో కసరత్తు చేస్తున్నారని సమాచారం. పవర్‌ఫుల్ యాక్షన్ ఇతివృత్తంతో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

2751

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles