నిజమైన మిత్రుడు అతనే!

Wed,November 20, 2019 12:05 AM

కిరణ్ అబ్బవరం, రహస్యగోరఖ్ జంటగా నటించిన చిత్రం రాజావారు రాణిగారు. రవికిరణ్ కోలా దర్శకుడు. మనోవికాస్, మనోజ్ నిర్మాతలు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాలో నటించిన కిట్టయ్య అనే వ్యక్తిని సుకుమార్ పరిచయం చేశారు. అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇతను నా నిజమైన మిత్రుడు. నా కాలులో ముళ్లు గుచ్చుకుంటే వాడికి కన్నీళ్లు వస్తాయి. చిన్నతనంలో నాకు సినిమాలంటే బాగా ఇష్టం ఉండేది. కిట్టయ్య కూలి చేసి వచ్చిన డబ్బులతో నన్ను సినిమాలకు తీసుకెళ్లేవాడు. నా స్నేహితుడికి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. పల్లెటూరిలో పుట్టిన వారికి తమ ఊరి జ్ఞాపకాల్ని గుర్తుకుతెచ్చే చిత్రమిదని, ప్రతి సన్నివేశం హృద్యంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. భారీస్థాయిలో సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జయ్‌క్రిష్.

499

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles