మనసే మేఘమాయే..


Thu,August 22, 2019 11:38 PM

raja vaaru rani vaaru mammela lede release on september

కిరణ్, రహస్యగోరఖ్ జంటగా నటిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. రవికిరణ్ కోలా దర్శకుడు. ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మనోవికాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయ్‌క్రిష్ సంగీతసారథ్యం వహించిన ఈ చిత్రంలోని నమ్మేలా లేదే..కలకాదే..మనసే మేఘమాయే అనే రెండో పాటను గురువారం విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మెలోడీ ప్రధానంగా సాగే ఈ పాటకు మంచి స్పందన లభిస్తున్నది. టైటిల్ సాంగ్ కూడా బాగా ఆకట్టుకుంటున్నది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుంది. పల్లెటూరి అనుబంధాలకు దర్పణంలా నిలుస్తుంది అన్నారు. రాజ్‌కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్, స్నేహమాధురి, దివ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్, అమర్‌దీప్, రచన-దర్శకత్వం: రవికిరణ్ కోలా.

181

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles