రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’


Wed,September 11, 2019 12:34 AM

Raj Tarun next titled Orey Bujjigaa

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘ఒరేయ్‌ బుజ్జిగా’ అనే పేరును ఖరారుచేశారు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. మాళవిక నాయర్‌ కథానాయిక. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘రొటీన్‌కు భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. వినోదం, కుటుంబ విలువల్ని జోడిస్తూ దర్శకుడు విజయ్‌కుమార్‌ వినూత్నమైన కథను సిద్ధంచేశారు. మంగళవారం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఏకధాటిగా సినిమాను చిత్రీకరిస్తాం. మా సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. వాణీవిశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజారవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ఐ ఆండ్రూ, ఆర్ట్స్‌: రాజ్‌కుమార్‌.

191

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles