రాజ్‌తరుణ్‌కు జోడీగా..?


Sat,May 11, 2019 11:36 PM

Raj Tarun and Nithya Menen to act together in New movie directed by vijaykumar konda

తన కంటే వయసులో పెద్ద అయిన యువతిని ప్రేమించే ఓ యువకుడి కథ నేపథ్యంలో తెలుగులో చాలా ఏళ్ల క్రితం ఓ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం అదే తరహా కథతో దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో దర్శకుడిగా తొలి కమర్షియల్ విజయాన్ని అందుకున్న ఆయన ఆ తరువాత ఒక లైలా కోసం చిత్రంతో ఊహించని పరాజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తరువాత కొంత విరామం తీసుకున్న విజయ్‌కుమార్ కొండా కొత్త తరహా ప్రేమకథతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ చిత్రంలో హీరోగా రాజ్ తరుణ్ నటించనుండగా అతని కంటే వయసులో పెద్ద అయిన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.

1502

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles