థ్రిల్లర్ రాహు


Sun,August 25, 2019 12:42 AM

Rahu Movie Teaser Launch

అభిరామ్, కృతి గార్గ్ జంటగా నటిస్తున్న చిత్రం రాహు. సుబ్బు వేదుల దర్శకుడు. ఏవీఆర్ స్వామి, శ్రీశక్తి బాబ్జీ, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని శనివారం దర్శకుడు బీవీఎస్ రవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థ్రిల్లర్ చిత్రాల్ని నిర్మించడానికి నిర్మాతలు ముందుకురారు. పైగా వాటిలో అనవసర జోక్యం చేసుకుంటూ ఆ కథను మొత్తానికి కిచిడీ చేసేస్తారు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో నిర్మాతలని ఒప్పించి, తాను అనుకున్న కథని కాపాడుకుని యథాతథంగా తీయడం గొప్ప విషయం. అందుకోసం దర్శకుడు సుబ్బు ఎంత కష్టపడ్డాడో, అతన్ని నిర్మాతలు ఎంతగా నమ్మారో అర్థమౌతోంది.

మనలో టాలెంట్ వుంటే ఏ దారిలో అయినా రావచ్చు. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు దర్శకుడు, కెమెరామెన్, సంగీత దర్శకుడి పనితనం ఏంటో బయటపడుతుంది. వాళ్లు తమ పూర్తి స్థాయి ప్రతిభని కనబరిచేందుకు స్కోప్ వుంటుంది. టీజర్ చూస్తుంటే వేడి వేడి జిలేబీలా వుంది. కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకముంది అన్నారు.టీజర్ సినిమా ఏంటో తెలియజేస్తుందని భావిస్తున్నాను. కొత్త తరహా కథతో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపారు.

200
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles