రహస్యం ఏమిటి?


Sun,December 16, 2018 12:27 AM

Rahasyam Movie Pre Release Event 2018 Latest Telugu Movie Rahsyam Ft.

శైలేష్, శ్రీరితిక జంటగా నటిస్తున్న చిత్రం రహస్యం. సాగర్ శైలేష్ దర్శకుడు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ హారర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఓ అంతుబట్టని రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఎదురైన పరిస్థితులేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. హారర్‌తో పాటు వినోదం ఉంటుంది అన్నారు. విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అందరికి నచ్చుతుందని హీరో శైలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, శివశక్తిదత్తా, రాజ్ కందుకూరి, శివశంకర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

1910

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles