Telangana Intermediate 1st & 2nd Year Results 2019

అంతకుమించి..!


Sun,March 17, 2019 11:42 PM

raghava lawrence kanchana 3 release date announced

రాఘవ లారెన్స్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తమిళ చిత్రం కాంచన-3ని అదే పేరుతో రాఘవ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఒవియా, వేదిక కథానాయికలు. లైట్ హౌస్ మేకర్స్ ఎల్ ఎల్ పి పతాకంపై నిర్మాత బి. మధు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ కాంచన-3 నా కెరీర్‌లో ప్రత్యేకమైనది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తాయి. గతంలో వచ్చిన కాంచన సిరీస్ చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాయి.

అయితే అంతకు మించిన కథాబలంతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా దాదాపు 220 రోజుల పాటు వర్క్ చేశాం. ప్రతి చిన్న విషయాన్ని చాలా కేర్ తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాం. దీంతో అంచనాలు తారా స్థాయికి చేరే అవకాశం వుంది. ఇందులో నేను పోషించిన పాత్రకు మంచి పేరొస్తుంది. నా లుక్ కోసం చాలా కేర్ తీసుకున్నాం. తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని మధుగారు ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నారు అని తెలిపారు.

2305

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles