కాంచన ప్రతీకారం


Thu,January 10, 2019 07:13 AM

Raghava Lawrence Kanchana 3 Movie First Look Relese

రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన కాంచన సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. తాజాగా ఈ సిరీస్‌లో కాంచన-3 రానున్నది. రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బి. మధు సమర్పకుడు. ఓవియా, వేదిక కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఈ పోస్టర్‌లో పంచెకట్టుతో మెడలో రుద్రాక్షలు ధరించి వైట్ హెయిర్‌ైస్టెల్‌తో రాఘవ లారెన్స్ వినూత్న లుక్‌లో కనిపిస్తున్నారు. చిత్ర సమర్పకుడు బి. మధు మాట్లాడుతూ ప్రతీకార నేపథ్యంతో తెరకెక్కుతున్న హారర్ కామెడీ సినిమా ఇది. ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. వైవిధ్యమైన కథాంశంతో రాఘవ లారెన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన పాత్ర సరికొత్తగా ఉంటుంది. డాల్బీ అట్మాస్ సౌండ్‌తో విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేస్తాం అని తెలిపారు. కోవై సరళ, కబీర్ దుహాన్ సింగ్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, వెట్రి.

2917

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles