దేవిశ్రీప్రసాద్‌ను ఆదర్శంగా తీసుకున్నాం!

Sat,October 19, 2019 12:04 AM

సినిమాలకు ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఏదైనా వేడుకకు మనల్ని అతిథిగా ఆహ్వానించారంటే అది మన అదృష్టంగా భావించాలి. ఆ స్థాయి ఇచ్చినందుకు అందరికి రుణపడి ఉండాలి అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. శుక్రవారం హైదరాబాద్‌లో రాగల 24గంటల్లో చిత్ర ప్రమోషనల్ పాటను, టీజర్‌ను ఆయన ఆవిష్కరించారు. సత్యదేవ్, ఈషారెబ్బా, శ్రీరామ్, ముస్కాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఢమరుకం సినిమా నుంచి దర్శకుడు శ్రీనివాసరెడ్డితో చక్కటి అనుబంధం ఏర్పడింది. మా కుటుంబ మిత్రుడాయన.


ఈ ప్రమోషనల్ గీతాన్ని రచయిత శ్రీమణి నేటి ట్రెండ్‌కు అనుగుణంగా రాశారు. రఘు కుంచె మంచి స్వరాన్ని సమకూర్చారు. టీజర్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ పాట రూపకల్పనకు దేవిశ్రీప్రసాద్‌గారే స్ఫూర్తి. ఆయన చేసే ఐటెంసాంగ్స్ సినిమాలకే ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ పాటను తీర్చిదిద్దాం. అతిథిగా ఆహ్వానించి పాటను ఆవిష్కరింపజేశాం అని దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. హారర్ థ్రిల్లర్ సినిమా అయినా పెద్దగా భయపెట్టే అంశాలు ఉండవని, కుటుంబ సభ్యులందరూ కలిసి చూడొచ్చని నిర్మాత పేర్కొన్నారు. పూర్తిస్థాయి మాస్‌ఫీల్‌తో ఈ గీతాన్ని స్వరపరిచానని సంగీత దర్శకుడు రఘు కుంచె చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

696

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles