నారాయణతే నమో నమో

Wed,October 23, 2019 12:56 AM

‘సినిమాలోని వెంకటేశ్వర స్వామి కీర్తనను నాతో విడుదల చేయించడం ఆనందంగా ఉంది. చక్కటి విజువల్స్‌తో ఈ పాటను చిత్రీకరించారు’ అని అన్నారు తితిదే బోర్డ్‌ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి. సత్యదేవ్‌, ఇషారెబ్బ, శ్రీరామ్‌, ముస్కాన్‌సేథీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస్‌ కానూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నారాయణతే నమో నమో..’ లిరికల్‌ వీడియోను సోమవారం హైదరాబాద్‌లో వై.వి.సుబ్బారెడ్డి విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘శ్రీనివాసరెడ్డితో ఇరవై ఏళ్లుగా నా స్నేహం కొనసాగుతున్నది. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. శతదినోత్సవాన్ని జరుపుకోవాలి’ అని తెలిపారు. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ‘దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుముకగా ఉంటూ ఎన్నో సేవలందిస్తున్నారు సుబ్బారెడ్డి. ఆయన మా సినిమాలోని పాటను విడుదలచేయడం ఆనందంగా ఉంది. యస్వీబీసీ బోర్డ్‌ డైరెక్టర్‌గా నాకు అప్పగించిన పదవీబాధ్యతల్ని నిజాయితీగా నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకుంటాను’ అని అన్నారు. రామానాయుడు, దిల్‌రాజు స్ఫూర్తితో తాను నిర్మాతగా మారానని, త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని శ్రీనివాస్‌ కానూరు పేర్కొన్నారు. మేము ఊహించిన దానికంటే ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్ద విజయాన్ని అందిస్తారనే నమ్మకముందని హాస్యనటుడు కృష్ణభగవాన్‌ అన్నారు.

457

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles