24గంటల్లో జరిగే కథ


Sat,July 6, 2019 11:57 PM

ragala 24 gantallo movie firstlook launch

సత్యదేవ్, ఈషారెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్‌సేథీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాగల 24గంటల్లో. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. హీరో శ్రీరామ్ ముఖ్యపాత్రలో నటించారు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. శ్రీనివాస్‌రెడ్డి తనదైన మార్క్ హాస్యాన్ని మేళవించి రూపొందించారు. ఆయన పనితనం ఎంతగానో నచ్చింది. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాను అన్నారు.

24 గంటల్లో జరిగే అనూహ్య సంఘటనల సమాహారమే చిత్ర ఇతివృత్తం. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈషారెబ్బ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఆమె కెరీర్‌కు బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుంది. సత్యదేవ్ తన పాత్రలో ఒదిగిపోయారు. శ్రీరామ్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. వినూత్న, కథ కథనాలతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అంజి, సంగీతం: రఘు కుంచె, కథ: వై.శ్రీనివాస్‌వర్మ, మాటలు: కృష్ణభగవాన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌రెడ్డి.

853

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles