అలాంటి కల కోసం..

Fri,March 22, 2019 12:05 AM

మహిళలు తమ కలల్ని, ఊహాప్రపంచంలోని అందమైన విషయాల్ని ఏ మాత్రం సంకోచం లేకుండా బయటకు వ్యక్తం చేయాలి. అప్పుడే వాళ్లు మానసికమైన సంఘర్షణ, ఒత్తిడి నుంచి దూరమవుతారు అని అంటున్నది మరాఠి చిన్నది రాధికా ఆప్టే. తమ కలల్ని వ్యక్తం చేసే విషయంలో మహిళలు ధైర్యంగా ఉండాలనే సందేశంతో ఓ స్వచ్ఛంద సంస్థ ముంబయిలో ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన రాధికా ఆప్టే తన చిన్నతనంలోని ఓ ఆసక్తికరమైన ఫాంటసీ గురించి వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు వివిధ ఛానళ్లలో వస్తున్న హిందీ సినిమాల్ని ఎక్కువగా వీక్షించేదాన్ని. అందులో కథానాయిక వానలో తడిసి చీరకొంగును గాలిలో విసరడం, ఆ తర్వాత హీరో వచ్చి ఆమెతో పాటలు పాడటం వంటి రొమాంటిక్ గీతాలు ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో మా క్లాస్‌లోని ఓ అబ్బాయి అంటే నాకు ఏదో తెలియని ఆకర్షణ ఉండేది. టీవీలో అలాంటి గీతాల్ని చూస్తున్నప్పుడు ఆ అబ్బాయితో కలిసి వానలో తడుస్తూ డ్యూయెట్స్ పాడినట్లు ఊహించుకునేదాన్ని. ఆ అబ్బాయి కలలో నాతో కలిసి డ్యాన్స్ చేయాలనే కోరికతో త్వరగా నిద్రపోయేదాన్ని అంటూ తన చిన్ననాటి ఫాంటసీ గురించి చెప్పింది రాధికా ఆప్టే.

1477

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles