ప్రవర్తన మార్చుకోండి!


Tue,March 26, 2019 01:21 AM

radha ravi suspended dmk over slut shames nayanthara

-రాధారవికి నయనతార వార్నింగ్

నయనతారని చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి అంటూ తమిళ సీనియర్ నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారాన్ని రేపాయి. పలువురు సినీ తారలు రాధారవి అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. వివాదం మరింత పెద్దదవుతుండటంతో రాధారవి నయనతారకు క్షమాపణ చెప్పారు. అయితే ఈ వివాదంపై నయనతార తీవ్రంగా స్పందించారు. సోమవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో తన ప్రవర్తన మార్చుకోవాలని రాధారవికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నేనెక్కువగా మీడియా ముందుకురాను. నా పని మాత్రమే నేనెంటో చెప్పాలని భావిస్తాను. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి అభినందనలు లభిస్తుండటం నాకు షాకింగ్‌గా అనిపిస్తున్నది. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో రాణిస్తున్నాను.

తమిళ ప్రజలు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా నేను దేవత, దెయ్యం, భార్య, ప్రేయసి, స్నేహితురాలు...తదితర పాత్రల్లో నటిస్తూనే ఉంటాను. రాధా రవిని పార్టీ నుంచి తొలగించినందుకు ముందుగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు. రాధారవికి పత్రికాముఖంగా ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే అన్న విషయం మర్చిపోకండి. ఆడవాళ్లను చులకన చేసి మాట్లాడటం మగతనం అనిపించుకోదు. ఎందరికో స్ఫూర్తిగా నిలవాల్సిన రాధారవిలాంటి వ్యక్తి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలతో నీచులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సినిమా అవకాశాలు లేనివారే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో పాపులారిటీని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తారు అంటూ నయనతార తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

1400

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles