1980నాటి ‘కల్కి’


Mon,June 17, 2019 11:34 PM

Radha Mohan About Rajasekhar KalKi Movie

రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. ఈ నెల 28న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కుల్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ సంస్థ నిర్మాత కె.కె.రాధామోహన్‌ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కల్కి’ టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. సినిమా కథాంశం నచ్చడంతో పంపిణీ చేయడానికి సిద్ధమయ్యాం. పరిశోధనాత్మక థ్రిల్లర్‌గా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో రాజశేఖర్‌ పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. స్కార్లెట్‌ విల్సన్‌ ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌' అనే ప్రత్యేకగీతం యువతరాన్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. 1980దశకంలో జరిగే కథ ఇదని, యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించామని, అసాంఘిక శక్తులపై కల్కి పోరాటమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఆదాశర్మ, నందితాశ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్‌ విల్సన్‌, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌, అశుతోష్‌ రాణా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌, స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్‌: విల్‌, సమర్పణ: శివాని, శివాత్మిక.

2656

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles