ప్రతినాయిక పాత్రలో

Thu,October 3, 2019 10:55 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యోదంతాన్ని తెలుగు తెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మర్డర్ మిస్టరీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్రను పోషించనున్నది. షీనాబోరా హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా ప్రస్తుతం జైలుశిక్షను అనుభవిస్తున్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా పాత్రలో ఆమె కనిపించబోతున్నది. యథార్థ సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి రూపొందించిన ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలతో ఆమె క్యారెక్టర్ సాగుతుందని చిత్రబృందం చెబుతున్నది. స్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు గ్లామర్, పాజిటివ్ క్యారెక్టర్స్ చాలా చేశాను. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర చేయాలనే చిరకాల కోరిక ఈ సినిమాతో తీరనున్నది. జీవితాంతం గుర్తుండిపోయే విభిన్న క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది అని రాయ్‌లక్ష్మి చెప్పింది.

690

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles