ఆ ముద్ర చెరిగిపోతుంది..


Mon,September 18, 2017 12:11 AM

Raai Laxmi Hot Bikini in Julie 2 Movie

LaxmiRai
కథానాయికగా కంటే ప్రత్యేక గీతాలతోనే దక్షిణాదిలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది రాయ్ లక్ష్మీ. తాజాగా జూలీ-2 తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నది. నేహాధూపియా కథానాయికగా 2004లో వచ్చిన జూలీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. టూపీస్ బికినీతో హాట్‌హాట్‌గా కనిపిస్తున్న రాయ్‌లక్ష్మీ స్టిల్స్ సినిమాపై భారీగా అంచనాల్ని పెంచాయి. గ్లామర్ డోసును పెంచి ఆమె ఈ సినిమా చేస్తున్నట్లు, బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి అందాల విషయంలో హద్దులు దాటినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గ్లామర్‌కు మించిన ఎన్నో అద్భుతమైన అంశాలున్న చిత్రమిదని, అసభ్య సంభాషణలు, ప్రేక్షకుల్ని పక్కదోవ పట్టించే సన్నివేశాలేవి ఇందులో కనిపించవని చెబుతున్నది రాయ్‌లక్ష్మీ. గ్లామరస్‌గా కనిపిస్తూనే అభినయాన్ని ప్రదర్శించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని తెలిపింది. కేవలం ఓ ఫొటోను చూసి సినిమాపై అభిప్రాయానికి రావడం సరికాదని, కేవలం అందచందాలతోనే సినిమాలు ఆడవని చెప్పింది. ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో పరిణితితో వున్నారని పేర్కొంది. కథను నమ్మే చేశానని, ఈ సినిమాతో ప్రత్యేకగీతాల తారగా తనపై ఉన్న ముద్ర తొలిగిపోతుందనే నమ్మకముందని తెలిపింది. దీపక్ శివదాసని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది.

1564

More News

VIRAL NEWS