24 గంటల కథ

Thu,November 7, 2019 12:21 AM

సత్యదేవ్, ఈషారెబ్బా, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రాగల 24 గంటల్లో. శ్రీనివాస్‌రెడ్డి దర్శకుడు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది, ఆకట్టుకునే విధంగా దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి సినిమాను రూపొందించారని పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కొత్తగా పళ్లైన ఓ జంట జీవితంలో 24 గంటల వ్యవధిలో ఏం జరిగింది? హత్యానేరాన్ని శోధించే క్రమంలో ఓ పోలీస్ అధికారి తెలుసుకున్న నిజాలేమిటన్నది ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. ఈషారెబ్బా నటిస్తున్న తొలి మహిళా ప్రధాన ఇతివృత్తమిది. ఆమె అభినయం, పాత్ర చిత్రణ మెప్పిస్తాయి అని తెలిపారు. ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, ప్రధాన పాత్రల్లో నటిసున్నారు.

199

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles