అమరావతి వెళ్లి సంజాయిషి ఇవ్వాలా?


Thu,March 21, 2019 12:22 AM

R Narayana Murthy Fires On Censor Board Over RGV Lakshmi NTR

సెన్సార్ విధానం చాలా దుర్మార్గంగా తయారైంది. రామ్‌గోపాల్‌వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీశారు. ఆ సినిమాను సెన్సార్ చేయమంటున్నారు. ఎవరో వచ్చి చేయకూడదని చెబితే ఆపేస్తారా?. వర్మలాగే పోసాని కృష్ణమురళి సినిమా తీశారు. ఆ చిత్రాన్ని కూడా సెన్సార్ చేయమంటున్నారు. అది చెప్పుకోవడానికి అమరావతి వెళ్లాలా?. ఏం జరుగుతోంది?. అసలు ప్రజాస్వామ్యం వుందా? అని మండిపడ్డారు ఆర్. నారాయణమూర్తి. బుధవారం హైదరాబాద్‌లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూఅభ్యంతరాలు ఏమైనా వుంటే సెన్సార్ బోర్డు చూసుకుంటుంది. అందులో న్యాయ నిర్ణేతలు వున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే వాళ్లే చెబుతారు కానీ మరొకరు చెప్పే హక్కు లేదు. ఇటీవల సినిమాల పరంగా దుర్మార్గమైన పరిస్థితులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని యావత్ తెలుగు చిత్రపరిశ్రమ ముక్తకంఠంతో ఖండించాలి. ఏ సినిమా విషయంలోనూ మరొకరు జోక్యం చేసుకునే వీలు లేదు. ఏం చూడాలో చూడకూడదో సెన్సార్ వాళ్లే చెప్పాలి. అలా వారికి వదిలేయకుండా నిర్మాతల్ని ఇబ్బందులకు గురిచేస్తే ఎలా?. కళాకారులుగా మేం సినిమాలు తీస్తే సెన్సార్ పేరుతో ఆపేస్తున్నారు. అదేమంటే అమరావతి వెళ్లి సంజాయిషీ ఇవ్వమంటున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం. అన్నారు.

2629

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles