డబుల్ దిమాక్ శంకర్!


Sun,May 26, 2019 11:28 PM

puri jagannadh ram pothineni ismart shankar released on July 12th

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరాబాదీ ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ దర్శకుడు. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకంపై శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పూర్తయింది. జూలై 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పక్కా తెలంగాణ యువకుడి కథ ఇది. డబుల్ దిమాక్ వున్న శంకర్ జీవితంలో ఏం జరిగింది? తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం శంకర్ ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు అన్నదే ఈ చిత్ర కథ. రామ్‌ని కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. ఆయన నటన ఆకట్టుకుంటుంది. త్వరలో మూడు పాటల్ని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లలో చిత్రీకరించబోతున్నాం అన్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్నారు.

1573

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles