వినరా సోదర వీరకుమారా


Mon,October 15, 2018 02:12 AM

puri jagannadh launches vinara sodhara veerakumara

శ్రీనివాస్‌సాయి, ప్రియాంకజైన్ జంటగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం వినరా సోదర వీరకుమారా. సతీష్ చంద్రనాదెళ్ళ దర్శకుడు. లక్ష్మణ్ క్యాదరి నిర్మాత. ఈ చిత్రఫస్ట్‌లుక్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ దర్శకుడు సతీష్ ఈ కథనాకు వినిపించారు. చాలా బాగుంది. మంచి సందేశం మిళితమైన సినిమా ఇది. యువతరానికి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నవతరం మనోభావాలకు దర్పణంలా ఉంటుంది. వినోదం, ప్రేమ, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నాం. శ్రవణ్‌భరద్వాజ్ ఐదు అద్భుతమైన బాణీలనిచ్చారు. సెన్సార్ పూర్తిచేసి నవంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రవి, మాటలు, పాటలు: లక్ష్మీభూపాల, ఎడిటింగ్: మార్తండ్ కె. వెంకటేష్..

1718

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles