పూరి కనెక్ట్స్ 15లక్షల ఆర్థికసాయం

Sun,September 29, 2019 12:14 AM

అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముఫ్పైమందికి యాభైవేల చొప్పున సహాయం అందజేశారు. పూరికనెక్ట్స్ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం పదిహేనులక్షల రూపాయల ఆర్థికసహాయం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఛార్మి మాట్లాడుతూ తన వారసుడు పూరి జగన్నాథే అని దాసరి నారాయణరావుగారు ఓ సందర్భంలో చెప్పారట. ఆయన మాటల్ని పూరిజగన్నాథ్ ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. ఓ లెజెండ్ తన గురించి అంత గొప్ప మాటలు చెప్పినప్పుడు బాధ్యతగా ఏదైనా సహాయం చేయాలని పూరిజగన్నాథ్ ఈ కార్యానికి సంకల్పించారు. హీరో రామ్, పూరిజగన్నాథ్ ఇచ్చిన ధైర్యంతో ఇస్మార్ట్‌శంకర్ సినిమా ఆరంభించి గొప్ప విజయాన్ని అందుకున్నాం. అందుకే ఈ రోజు సహాయం చేయగలిగాం. ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ్ పుట్టినరోజున ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది అని చెప్పింది. ఈ కార్యక్రమంలో ఉత్తేజ్, కాశీవిశ్వనాథ్, దర్శకుల సంఘం సెక్రటరీ రాంప్రసాద్, సుబ్బారెడ్డి, భాస్కర్‌రెడ్డి, విష్ణువర్ధన్, ఆదుర్తి రమణ తదితరులు పాల్గొన్నారు.

749

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles