చిన్నారి చేతన గుర్తొచ్చింది!


Wed,May 22, 2019 11:25 PM

Producer Suresh Kondeti  From Lissa 3D Movie

ప్రేమిస్తేతో నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభమైంది. షాపింగ్‌మాల్, జర్నీ తర్వాత మరోసారి అంజలి నటించిన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది. హారర్ ఇతివృత్తంతో రూపొందిన సినిమా ఇది. ఇందులో భయపెట్టే అంశాలతో పాటు హృదయానికి హత్తుకునే సెంటిమెంట్ కూడా వుంది. నిర్మాతగా నా కెరీర్‌లో మరో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అవుంది అన్నారు సురేష్ కొండేటి. ఆయన తెలుగులో అందిస్తున్న ద్విభాషా చిత్రం లీసా. రాజు విశ్వనాథ్ దర్శకుడు. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సురేష్ కొండేటి మాట్లాడుతూ 3డీ సినిమా అనగానే నాకు 1985లో వచ్చిన చిన్నారి చేతన చిత్రం గుర్తొచ్చింది.

లీసా చిత్రాన్ని చూసిన వాళ్లు కూడా అలాంటి అనుభూతికే లోనవుతారు. హారర్ సినిమా అయినా పెద్దవాళ్లు, పిల్లలు ఎంజాయ్ చేసేలా వుంటుంది. 3డీలో ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనవుతారు. 2.ఓ చిత్రానికి గ్రాఫిక్స్ అందించిన టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేశారు. విజువల్స్ అబ్బురపరుస్తాయి. అన్నారు.

752

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles