నూతన చిత్రాలకు శ్రీకారం!


Sat,June 8, 2019 11:52 PM

producer chanti addala new movies

నవ్యమైన కథ,కథనాలతో రెండు నూతన చిత్రాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. కళా దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారి ప్రభాస్‌తో అడవిరాముడు, ఎన్టీఆర్‌తో అల్లరిరాముడు వంటి భారీ చిత్రాలతో పాటు పలు చిత్రాలను నిర్మించారు. కాగా ఆదివారం (నేడు) ఆయన జన్మదినం. ఈ సందర్భంగా నూతన చిత్రాల విశేషాలను తెలియజేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర శిష్యరికం చేసిన హరిహరన్‌ను పరిచయ చేస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర పనిచేసిన సుబ్బు దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేస్తాను అని తెలిపారు.

468

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles