ప్రియాంక అన్‌ఫినిష్డ్


Mon,February 11, 2019 12:02 AM

Priyanka Chopra to release memoir Unfinished in 2019

మిస్ వరల్డ్ టైటిల్ విజేతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియాంకచోప్రా హిందీ చిత్రసీమలో అగ్ర నాయికగా పేరు తెచ్చుకుంది. ఆపై హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడ కూడా విజయకేతనాన్ని ఎగరేసింది. ఇటీవలే హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్‌జోనస్‌ను పెళ్లాడిన ఈ సొగసరి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే విరామ సమయాల్లో ఈ అమ్మడు తన జీవితంలోని ముఖ్యఘట్టాల్ని పొందుపరుస్తూ ఓ పుస్తకాన్ని రాస్తున్నదట. ప్రియాంక జీవన గమనంలో మరపురాని జ్ఞాపకాలకు అక్షరరూపమిదని, ఎవరికి తెలియని ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయని ప్రియాంక సన్నిహితులు పేర్కొన్నారు. అన్‌ఫినిష్డ్ అనే శీర్షికతో ఈ పుస్తకం రాబోతున్నదని సమాచారం. ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ ఈ పుస్తక ముద్రణ బాధ్యతల్ని తీసుకుందని తెలిసింది.

966

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles