ప్రేమ గొప్పతనంతో..

Sat,February 9, 2019 11:53 PM

ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటడం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. అదే స్థాయిలో సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు నిర్మాత గురురాజ్. మలయాళ చిత్రం ఒరు అడార్ లవ్ తెలుగులో లవర్స్ డే పేరుతో అనువాదమవుతున్నది. ప్రియాప్రకాష్ వారియర్, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సుఖీభవ సినిమాస్ పతాకంపై ఏ.గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 14న ప్రేక్షకులముందుకురానుంది. నిర్మాతలు మాట్లాడుతూఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మా సన్నిహితులు కొందరు వద్దని వారించారు. అమ్మాయి కన్నుకొట్టినంత మాత్రాన సినిమా చూస్తారా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.

తీవ్రమైన పోటీలో ఈ చిత్ర తెలుగు హక్కుల్ని సొంతం చేసుకన్నాం. పదిరెట్లు ఎక్కువ వ్యయం చేసి సినిమాను దక్కించుకున్నాం. నవ్యమైన ప్రేమకథతో మా కెంతగానో నచ్చింది. ఈ చిత్రాన్ని అంతా కొత్తవాళ్లతోనే తెరకెక్కించారు. కథానుగుణంగా వారందరూ అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. ఇందులో మొత్తం 9 పాటలుంటాయి. ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్‌కు బ్రహ్మాండమైన స్పందన లభించింది. టీజర్‌ను ఒక్కరోజులోనే 20లక్షల మంది వీక్షించారు. స్నేహం, ప్రేమ గొప్పదనాన్ని తెలియజేస్తూ ఇంటిల్లిపాదిని అలరించే చిత్రమవుతుంది. పెద్ద సినిమా స్థాయి క్రేజ్ వచ్చింది. తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరించే చిత్రమవుతుంది. దాదాపు 400లకు పైగా థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.

905

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles