మధ్యతరగతిపై వ్యంగ్యాస్త్రం


Sat,June 15, 2019 11:41 PM

Pressure Cooker Movie First Look Launch by Suresh Babu

సాయిరొనాక్, ప్రీతి ఆష్రాని నాయకానాయికలుగా నటించి చిత్రం ప్రెజర్ కుక్కర్. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో సుజై, సుశీల్ రూపొందిస్తున్నారు. ఏ.అప్పిరెడ్డి మరో నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నిర్మాత డి.సురేష్‌బాబు శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు చిత్ర విశేషాలు తెలియజేస్తూ తమ పిల్లల్ని ఇంజినీర్లను చేసి అమెరికాకు పంపడమే పరమావధిగా భావిస్తున్న మధ్యతరగతి తెలుగు కుటుంబాలపై విసిరిన వ్యంగ్యాస్త్రమే మా చిత్రం. కిషోర్ అనే యువకుడు ఏం చేసైనా అమెరికా వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను పడ్డ కష్టాలు, నేర్చుకున్న పాఠాలు, అతనిలో పెరిగిన ఆత్మవిశ్వాసం, కుటుంబ విలువల పట్ల పెరిగిన గౌరవం..ఈ అంశాలన్నింటిని చర్చించే చిత్రమిది. నేటి యువతకు ఓ సందేశంలా ఉంటుంది అన్నారు.

నేటి యువతకు సందేశాన్నందిస్తూనే వ్యంగ్యాత్మకంగా, వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాతల్లో ఒకరైన అప్పిరెడ్డి తెలిపారు. తాను నిజజీవితంలో ఎదుర్కొన్న కొన్ని సమస్యల్ని ఈ సినిమాలో చర్చించారని హీరో సాయిరొనాక్ తెలిపారు. ఈ కాన్సెప్ట్‌పై దర్శకులిద్దరూ రెండు సంవత్సరాల పాటు శ్రమించారని మధుర శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. తనికెళ్ల భరణి, సంగీత, రాహుల్ రామకృష్ణ, రాజై రోవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నగేష్ బనెల్, అనిత్ మదాడి, సంగీతం: సునీల్ కశ్యప్, సాహిత్యం: సిరాశ్రీ, రాహుల్ సిప్లిగంజ్, రచన-దర్శకత్వం: సుజై, సుశీల్.

1179

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles