ప్రేమ పయనంలో..


Sun,September 23, 2018 11:21 PM

Prementha Panichese Narayana Movie Relese Date October 5th

హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమెంత పనిచేసే నారాయణ. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పెద్ద హీరోలతో ఇప్పటికి ఎనిమిది చిత్రాలు చేశాను. ఇది నా 9వ సినిమా. అంతా కొత్తవారితో సరికొత్త కాన్సెప్ట్‌తో చేస్తున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ఇది. ఓ సాధారణ యువకుడికి ప్రేమ ప్రయాణంలో ఎదురైన సమస్యలేమిటి? వాటిని అధిగమించి అతను ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నదే చిత్ర కథ. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి హరిని హీరోగా పరిచయం చేస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. హరి డ్యాన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. జగపతిబాబు చెప్పిన వాయిస్ ఓవర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దర్శకుడిగా నన్ను ఆదరించినట్టుగానే మా అబ్బాయిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

1307

More News

VIRAL NEWS

Featured Articles