రెండింతల వినోదం

Published: Sun,January 20, 2019 11:52 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

సుమంత్ అశ్విన్, నందితాశ్వేత, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రేమకథా చిత్రమ్-2. హరికిషన్ దర్శకుడు. ఆర్.పి.ఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నటుడు రావురమేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ప్రేమకథా చిత్రమ్‌కు సీక్వెల్‌గా రూపొందిస్తున్న చిత్రమిది. హారర్ ఎంటర్‌టైనర్ కథాంశంతో ఆద్యంతం నవ్విస్తూనే భయపెడుతుంది. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఆత్మ కారణంగా ప్రేమ జంట ఎదుర్కొనే ఇబ్బందులు వినోదాల్ని పంచుతాయి. రావురమేష్ వాయిస్ ఓవర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. ఫిబ్రవరి 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. విద్యుల్లేఖరామన్, ప్రభాస్‌శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: సి.రాంప్రసాద్, సంగీతం: జేబీ, సహనిర్మాతలు: ఆయుష్‌రెడ్డి, ఆర్.పి. అక్షిత్‌రెడ్డి.

1620

More News