ప్రేమకథా విచిత్రం!


Mon,February 18, 2019 11:15 PM

Prema Katha Chitram 2 The Nandita Swetha starrer finally gets a release date

సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ప్రేమకథా చిత్రం-2. హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. మార్చి 21న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ మా సంస్థ నిర్మించిన ప్రేమకథా చిత్రమ్ ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. సీక్వెల్‌ను కూడా అదే స్థాయిలో రూపొందించాం. రావు రమేష్ ఈ చిత్రం కోసం వాయిస్ ఓవర్ అందించారు. ఆయన వాయిస్ ఓవర్‌తో కథ మొదలవుతుంది. భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మార్చి 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందన్న నమ్మకముంది అన్నారు. కృష్ణతేజ, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ఎన్.టి.వి. సాయి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, కెమెరా: సి. రాంప్రసాద్, మాటలు: గణేష్, పాటలు: అనంతశ్రీరామ్, కాసర్ల శ్యామ్, పూర్ణాచారి.

1909

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles