Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ఈజీ కాదు ప్రేమ


Tue,March 19, 2019 11:14 PM

Prema Antha Easy kadu Movie Teaser Released

ఈశ్వర్ దర్శకత్వంలో పారిజాత మూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ప్రేమ అంత ఈజీ కాదు. రాజేష్‌కుమార్, ప్రజ్వాల్ జంటగా నటిస్తున్నారు. టి.నరేష్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నమైన ప్రేమకథా చిత్రమిది. మనసుకు నచ్చిన అమ్మాయి ప్రేమను సొంతం చేసుకునే క్రమంలో ఓ ప్రేమికుడికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయన్నది ఆసక్తిని పంచుతుంది. రాజేష్, ప్రజ్వాల్ కెమిస్ట్రీ హైలైట్‌గా ఉంటుంది అని చెప్పారు. ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలతో ముడిపడిన నాటకీయ కథాంశమిదని, త్వరలో గీతాల్ని, ఈ నెలాఖరున సినిమాను విడుదలచేస్తామని దర్శకుడు చెప్పారు. ధన్‌రాజ్, రాంప్రసాద్, ముక్తార్‌ఖాన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చక్రి, సంగీతం: జై.ఎం.

674

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles