ప్రేమపయనంలో..


Tue,March 26, 2019 01:17 AM

prema antha easy kadu movie release on 29th of this month

రాజేష్‌కుమార్, ప్రజ్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమ అంత ఈజీ కాదు. టి.నరేష్, టి. శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈశ్వర్ దర్శకుడు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదలకానుంది. చిత్ర సమర్పకుడు అంజయ్య మాట్లాడుతూ రొటీన్‌కు భిన్నమైన ప్రేమకథా చిత్రమిది. సెన్సార్ పూర్తయింది. యు సర్టిఫికెట్ లభించింది. మంచి సినిమా తీశామని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ మనసు దోచిన ప్రియురాలి ప్రేమను గెలుచుకునేందుకు ఓ ప్రేమికుడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ప్రేమ ప్రయాణంలో ఎదురైన అవరోధాల్ని ఎలా అధిగమించాడు అనేది ఈ చిత్ర కథ. ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమా ఇది. అనేక అడ్డంకుల్ని దాటుకొని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని తెలిపారు. ధన్‌రాజ్, రాంప్రసాద్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: జై.ఎం, ఛాయాగ్రహణం: చక్రి.

491

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles